![]() |
![]() |
.webp)
శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోలో హోస్ట్ రష్మీ ఎప్పుడూ లేనంతగా ఏడ్చేసింది. చంద్రబోస్ ఒక పాట పాడి ఆమెను ఏడిపించారు. ఈ షోకి "బాడ్ గర్ల్స్" మూవీ టీమ్ నుంచి గీత రచయిత చంద్రబోస్, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ వచ్చారు. ప్రోమో స్టార్టింగ్ నుంచి ఫుల్ జోష్ తో సాగింది. రష్మీ కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది కానీ ప్రోమో లాస్ట్ లో ఐతే రష్మీ అదే పనిగా ఏడుస్తూనే ఉంది. జీవితంలో ఒక్క మనిషైనా మన కోసం ఉంటె ఆ ఆనందమే వేరు. అది అమ్మాయైనా , అబ్బాయైనా...ఇక్కడ రష్మీ బాధ కూడా అదే. ప్రోమో చివరిలో అనూప్ రూపెన్స్ గిటార్ ప్లే చేస్తుంటే చంద్రబోస్ ఒక సాంగ్ పాడారు. "ఇలా చూసుకుంటానే ఇలా చూసుకుంటానే చెలి నిన్ను కలకాలం ఇలా చూసుకుంటానే..కన్నీళ్లను అడుగుతానే నవ్వుల్లోనే రావాలని...దూరాన్నీ అడుగుతానే ఏడడుగులతో ఆగాలని...మరణాన్నే అడుగుతానే ఇద్దరికీ ఒకేసారి రావాలని" అంటూ ఒక హార్ట్ టచ్చింగ్ సాంగ్ ని పాడారు. ఆ పాట పట్టినంత సేపు రష్మీ ఏడుస్తూనే ఉంది. "నిజంగా మీ పాట విన్న తర్వాత మనస్ఫూర్తిగా ఇలాంటి ఒక అబ్బాయి దొరికితే మాత్రం అదృష్టమే అనుకోవాలి." అంటూ చెప్పి మళ్ళీ ఏడ్చింది. దాంతో చంద్రబోస్ కూడా పాపం చాలా ఫీలయ్యారు రష్మీ మాటలకు. ఇక ఆ పాట పాడే టైములో ఆది వెళ్లి చంద్రబోస్ కాళ్ళు మొక్కాడు. బుల్లితెర మీద రష్మీ - సుధీర్ జోడి చేసిన మ్యాజిక్ గురించి అందరికీ తెలుసు. చాలా షోస్ లో వీళ్లకు పెళ్లి కూడా చేసేసారు. రియల్ లైఫ్ లో కూడా ఇద్దరికీ పెళ్ళైపోతుంది అని అంతా ఎదురు చూసారు. కానీ ఇద్దరూ వేరైపోయారు. సుధీర్ ఛానెల్ చేంజ్ ఐపోయాడు అలాగే మూవీస్ లో నటిస్తున్నాడు. ఏ షోలో సుధీర్ టాపిక్ వచ్చిన రష్మీ రియాక్షన్ కొంచెం డల్ గా కనిపిస్తుంది. ఇక ఇప్పుడు చంద్రబోస్ సాంగ్ కి కూడా రష్మీ ఏడ్చేసింది.
![]() |
![]() |